హైదరాబాద్ : నగరంలో అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని నోవాటెల్‌లో సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుండి ప్రతినిధులు హైదరాబాద్‌కు విచ్చేశారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. జనవరి 19 – 21వ తేదీ వరకు సదస్సు జరుగనుంది.
ఇక ఈ సదస్సులో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హాజారే, ప్రత్యేక అతిథిగా సార్క్ మాజీ సెక్రటరీ జనరల్ అర్జున్ బహదూర్ థాపా హాజరు కానున్నారు. 20వ తేదీ ముగింపు సమావేశానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హాజరు కానున్నారు. మొత్తం 135 దేశాల నుండి 550 మంది ప్రతినిధులు పాల్గొంటారు. 16 దేశాల నుండి 70 మంది వక్తలు, 40 ప్రత్యేక ఆహ్వానితులు హాజరౌతారని నిర్వాహకులు వెల్లడించారు.