తెలంగాణలో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ కొనసాగనుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ మార్చి 31 వరకు ఉన్నప్పటికీ ప్రస్తుత కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తప్పని పరిస్థితుల్లో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ కొనసాగనున్నట్టు తెలిపారు. లాక్ డౌన్ చేయకుంటే ఇంకా భయాంకరమైన పరిస్థితులు ఉండేవన్నారు. కూరగాయల కోసం గుంపులుగా పోవద్దని అన్నారు.
ఈ పరిస్థితుల్లో ఎవరూ ఆకలికి గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇతర కూలీలను ఆదుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. నిత్యావసర సరుకుల కోసం అందరూ ఒక్కసారే బయటకు పోవద్దని కేసీఆర్ సూచించారు. ప్రజలు సహకరించండి.. ఎక్కడివారు అక్కడే ఉండాలని తెలిపారు. హాస్టళ్లను మూసివేసే పరిస్థితి లేదన్నారు. భయపడాల్సిన అవసరం లేదన్నారు.
కదలికలను నివారిస్తేనే కరోనాను అరికట్టగలమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని కేసీఆర్ అన్నారు. ప్రజల కదలికలు ఆగితే చాలు.. అందరికీ అన్నం పెడతామని తెలిపారు. పశుగ్రాసం తీసుకెళ్లే వాహనాలు యధావిధిగా తిరగొచ్చునని స్పష్టం చేశారు.
See Also | బిగ్ బ్రేకింగ్ : బ్రిటన్ ప్రధానమంత్రికి కరోనా పాజిటివ్