నిజామాబాద్ మినహా ముగిసిన పోలింగ్

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ మినహా ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఛాన్స్ కల్పించారు ఎన్నికల అధికారులు.

  • Publish Date - April 11, 2019 / 11:58 AM IST

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ మినహా ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఛాన్స్ కల్పించారు ఎన్నికల అధికారులు.

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ మినహా ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఛాన్స్ కల్పించారు ఎన్నికల అధికారులు. అయితే నిజామాబాద్‌లో మాత్రం సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
Read Also : ఎన్నికల డ్యూటీలో మహిళా కానిస్టేబుల్ మృతి

ఇక్కడ కూడా ఓటు వేసేందుకు క్యూ లైన్లో ఉన్న వారికి అవకాశం కల్పిస్తారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించారు ఎన్నికల అధికారులు. స్ట్రాంగ్ రూంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సైతం ఓటు వేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతులు చింతమడకలో ఓటు వేశారు. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 6గంటల నుండి పోలింగ్ నిర్వహంచారు. పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు ప్రజలు తరలివచ్చారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతానికి పైగా పోలింగ్ జరిగిందని తెలుస్తోంది. 

నిజామాబాద్‌లో 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ఇక్కడ పోలింగ్ సమయాన్ని పెంచారు. ఇక్కడ ఈవీఎంలు పని చేయకపోవడం పట్ల టీఆర్ఎస్ అభ్యర్థి కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ స్టార్ట్ కావడం ఆలస్యం అయినందున సమయం పెంచాలని ఆమె కోరారు. 
Read Also : విశాఖ ఏజెన్సీలో భారీ విధ్వంసానికి మావోయిస్టుల వ్యూహరచన