తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను చివరకు 443 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీచేసే వారి సంఖ్య ఫైనల్ అయింది. అన్నీ పార్లమెంటరీ స్థానాలకు కలిపి 60 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటుకు పోటీ పడుతున్న అభ్యర్ధుల్లో మొత్తం 19మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి.
-ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేస్తున్న టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు మీద మహిళపై వేధింపులు, ఓటర్లను ప్రలోభపెట్టడం, హవాలా వ్యాపారం వంటి ఆరోపణలపై ఆయనపై కేసులు నమోదై ఉన్నాయి.
-బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావుపైన అత్యధికంగా52కేసలు నమోదై ఉన్నాయి. హ్యూమన్ ట్రాఫికింగ్, పాస్‌పోర్ట్ స్కామ్ వంటి ఆరోపణలతో కేసులు నమోదై ఉన్నాయి.
-కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి అభ్యర్ధి రేవంత్ రెడ్డి పైన 42కేసులు ఉన్నాయి.
-ఎమ్‌ఐఎమ్ ఎంపీ అభ్యర్ధి అసుదుద్దీన్ ఓవైసీపైన 5 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ కేసులు అన్నీ తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలలో పెట్టబడినవి. అందులో ఒక కేసు తొమ్మిదేళ్ల నుండి పెండింగ్‌లో ఉన్నది.
-నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కవితపై రెండు కేసులు ఉన్నాయి. నిజామాబాద్, మహబూబ్ నగర్‌లలో రెండు చోట్ల తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమెపై కేసులు నమోదై ఉన్నాయి.
-టీఆర్ఎస్ పార్టీ నుంచి మారి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న జితేందర్ రెడ్డిపైన కూడా మూడు కేసులు ఉన్నాయి.