అధ్యక్షా : కొలువుదీరనున్న తెలంగాణ అసెంబ్లీ

  • Publish Date - January 16, 2019 / 01:57 PM IST

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కొలువుదీరనుంది. జనవరి 17 నుండి 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అటు రాజ్‌భవన్‌లో.. ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, కేటీఆర్‌, హరీశ్‌రావు, వినోద్‌ కుమార్‌ సహా పలువురు ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.
మొదటగా కేసీఆర్ ప్రమాణం…
అసెంబ్లీలో మొదట కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఇతర సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఈనెల 18న స్పీకర్ ఎన్నిక, 19న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, ఆమోదం ఉండనుంది.
అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఉదయం 11 గంటలకు గన్ పార్కులో అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం 11.05 నుంచి అసెంబ్లీలో జరిగే కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. 

  • ప్రొటెం స్పీకర్ గా ముంతాజ్ ఖాన్ ప్రమాణస్వీకారం
  • ముందుగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న కేసీఆర్
  • 18న స్పీకర్ ఎన్నిక
  • 19న గవర్నర్ ప్రసంగం
  • 20న గవర్నర్ స్పీచ్ కు ధన్యవాద తీర్మానం, ఆమోదం

ట్రెండింగ్ వార్తలు