పంచాయతీ సమరం : నగరంలో పల్లె ఓటర్ల కోసం గాలింపు

  • Publish Date - January 20, 2019 / 04:53 AM IST

హైదరాబాద్ : అన్నా బాగున్నావే…అమ్మ బాగున్నావే…ఊరికి రావట్లే..ఏ…,రా…ఓటేసి పో…, పోయి..మళ్లీ వచ్చేందుకు అన్ని నేనే చూసుకుంటా…నీవు మాత్రం ఓటు వేయాలి…ఏమంటవు.., ఏదో కొంత ఇస్తలే…అనే మాటలు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వినిపిస్తున్నాయి. అరే…భయ్..ఆ ఊరోళ్లు ఎక్కడున్నారో..చూడురా…వెతుకు..పట్టుకొని ఊరికి వచ్చేటట్టు చూడండిరా..ఇలా..అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. ఇదంతా హైదరాబాద్ నగరంలో చోటు చేసుకొంటోంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల గంట మోగిందిగా. 

Read More : పంచాయతీ సమరం : ‘గుర్తుండేలా’ ప్రచారం
Read More : పంచాయతీ సమరం : ఆటోవాలా సర్పంచ్

నగర శివారు ప్రాంతాల్లో పల్లె ఓటర్లు : 
ఊర్లో ఎలాంటి పనులు దొరక్కపోయేసరికి చాలా మంది నగరానికి వలస వచ్చి వివిధ ప్రాంతాల్లో మకాం వేసి కూలీ…ఇతరత్రా పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పంచాయతీ సమరం రావడంతో వీరి ఓట్లు ప్రస్తుతం కీలకమయ్యాయి. అభ్యర్థులు..వారి అనుచరగణం నగరంలో వాలిపోయారు. వీరిని మచ్చిక చేసుకొనేందుకు మార్గాలు వెతుకుతున్నారు. వారు ఎక్కడున్నారో కనుక్కొని..ఫోన్ చేసి…, సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న…నాకే ఓటు వేయి…పక్కా ఊరికి రా..అంటూ అభ్యర్థులు విన్నవించుకుంటున్నారు. 
హైదరాబాద్ శివారు ప్రాంతాలైన హయత్ నగర్. వనస్థలిపురం, కర్మన్ ఘాట్, యాచారం, అబ్దుల్లాపూర్ మెట్, ఎల్బీనగర్, కర్మన్ ఘాట్, కూకట్ పల్లి, బీడీఎల్, మాదాపూర్, శంకర్ పల్లి, మణికొండ, శంషాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, నార్సింగి, బండ్లగూడ, చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లో పల్లె ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పోటీ పడి అభ్యర్థులు ఓటర్లను సంప్రదిస్తున్నారు. 
 

 

ట్రెండింగ్ వార్తలు