పరిషత్ ఎన్నికలు : పోలింగ్ శాతం వివరాలు

  • Publish Date - May 15, 2019 / 03:48 AM IST

తెలంగాణ పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడు విడుతల్లో 5,817 ఎంపీటీసీలు, 538 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించగా 162 ఎంపీటీసీలు, నలుగురు జడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన స్థానాలకు ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. కొన్ని గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎన్నికలను బహిష్కరించనటువంటి  చెదురుమొదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పరిషత్‌ ఎన్నికల చివరి దశ పోలింగ్‌ మే 14వ తేదీ మంగళవారం 9,494 కేంద్రాల్లో జరిగింది. చివరిదైన ఈ విడతలో 160 జడ్పీటీసీ, 1710 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. 

జిల్లా పోలింగ్ శాతం
యాదాద్రి భువనగిరి 88.40
నల్గొండ 85.50
సూర్యాపేట 85.04
మహబూబాబాద్ 79.56
సంగారెడ్డి 78.53
వరంగల్ రూరల్ 81.73
ఖమ్మం 86.47
రంగారెడ్డి 83.28
సిద్ధిపేట 75.76
మెదక్ 76.89
జనగామ 76.25
కొమరం భీం ఆసిఫాబాద్ 75.65
జోగుళాంబ గద్వాల 77.81
నాగర్ కర్నూలు 75.41
వనపర్తి 74.58
భద్రాద్రి కొత్తగూడెం 74.35
నిర్మల్ 78.53
ఆదిలాబాద్ 74.26
మంచిర్యాల 75.58
జగిత్యాల 73.06
రాజన్న సిరిసిల్ల 74.99
నిజామాబాద్ 72.01
కామారెడ్డి 75.35
ములుగు 72.31
వికారాబాద్ 70.85
జయశంకర్ భూపాలపల్లి 70.19
నారాయణపేట 68.53
మొత్తం 77.81

ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర అన్ని ఏర్పాట్లు చేయడంతో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 27న ఓట్ల లెక్కింపుతో పాటు అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో బరిలో దిగిన అభ్యర్థులంతా ఆరోజు కోసం ఎదురు చూస్తున్నారు…