DSP Bheem Reddy: డీఎస్పీ భీమ్‌రెడ్డి వెనుక ప్రముఖ హీరో.. డైరీలో సంచలన వివరాలు.. ఇంతకీ ఎవరా హీరో?

క్రమాస్తుల కేసులో ఏసీబీకి అరెస్టయిన డీఎస్పీ భీమ్‌రెడ్డి(DSP Bheem Reddy) వ్యక్తిగత డైరీలో ఒక ప్రముఖ సినీ హీరో పేరు బయటపడటం సంచలనం సృష్టిస్తోంది.

Telangana Police identified a Tollywood hero involvement in DSP Bhim Reddy case

  • డైరీలో చేరిన హీరో పేరు
  • మణికొండలో వెయ్యి కోట్ల స్కామ్
  • బయటపడ్డ భీమ్‌రెడ్డి బినామీ ఆస్తులు

DSP Bheem Reddy: అక్రమాస్తుల కేసులో ఏసీబీకి అరెస్టయిన డీఎస్పీ భీమ్‌రెడ్డి వ్యక్తిగత డైరీలో ఒక ప్రముఖ సినీ హీరో పేరు బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. మణికొండలోని ఒక ఆస్తి విక్రయానికి సంబంధించి, కుటుంబ కథాచిత్రాల హీరోగా గుర్తింపు పొందిన సదరు నటుడు భీమ్‌రెడ్డి నుండి రూ.3 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. వీరి మధ్య ఒప్పందం జరిగిన తరుణంలోనే దాడులు జరగడంతో ఈ వ్యవహారం వివాదంలో పడింది. భీమ్‌రెడ్డి డైరీలో ఎవరికి ఎంత ఇచ్చారు, ఎవరి నుండి ఎంత రావాలనే ఆర్థిక లెక్కలను ఒక పద్ధతిలో రాసుకున్నట్లు అధికారులు కోర్టుకు తెలిపారు.

Ayatollah Ali Khamenei Funeral: అలీ ఖమేనీ అంత్యక్రియలు పూర్తి.. వారం రోజుల అంతిమయాత్ర.. తదుపరి పరిణామాలపై ఉత్కంఠ

తన అక్రమ సంపాదనను దాచడానికి భీమ్‌రెడ్డి (DSP Bheem Reddy)బినామీల పేరుతో ఆస్తులు కొని, వారి నుండి ముందే క్యాన్సిలేషన్ డీడ్స్ రాయించుకునేవారని సోదాల్లో తేలింది. ఇలాంటివి సుమారు 30 డీడ్లతో పాటు 60కి పైగా ఆస్తి పత్రాలను, రెండు బ్యాంక్ లాకర్లు, పది బ్యాంక్ ఖాతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలో ఆయన అనారోగ్య కారణాలు చెప్పడంతో అరెస్టు కొంత ఆలస్యమైంది. ఈ భారీ ఆస్తుల కొనుగోలుకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయనే కోణంలో ఏసీబీ అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మణికొండ మర్రిచెట్టు జంక్షన్ వద్ద నిరుపేదల స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న రూ.1000 కోట్ల విలువైన రెండు అక్రమ వాణిజ్య సముదాయాల వెనుక భీమ్‌రెడ్డి హస్తం ఉన్నట్లు సమాచారం. హెచ్ఎండీఏ అనుమతులు లేకుండానే ఒక బిల్డర్ ఫ్రీలాంచ్ పేరిట రూ.800 కోట్లు వసూలు చేశాడని, ఇందులో భీమ్‌రెడ్డికి వాటాలు ఉన్నాయని ఏసీబీ పేర్కొంది. ఈ అవినీతి నెట్‌వర్క్‌లో భీమ్‌రెడ్డి కొందరు ఉన్నతాధికారులకు బినామీగా వ్యవహరించాడనే అనుమానంతో అధికారులు ఆ నిధుల ప్రవాహంపై ప్రత్యేక దృష్టి సారించారు.