వాతావరణం : ఆదిలాబాద్ 43.3 డిగ్రీలు

  • Publish Date - April 10, 2019 / 01:03 AM IST

రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం ఏర్పడుతోంది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం కురవగా పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే పలు ప్రాంతాల్లో ప్రజలు అధిక వేడిమికి గురై అల్లాడిపోయారు. ఆదిలాబాద్‌లో గరిష్టంగా 43.3 డిగ్రీలు, నిజామాబాద్‌లో 41.7 డిగ్రీలు, మెదక్‌లో 41.5 డిగ్రీలు, మహబూబ్ నగర్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

ఏప్రిల్ 10వ తేదీ బుధవారం సాధారణం కంటే 2  నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు కర్ణాటక, తమిళనాడు మీదుగా 1.5 కి.మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఈ కారణంగా ఏప్రిల్ 11వ తేదీ గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాట నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

ట్రెండింగ్ వార్తలు