Meru International School’s Merutsav-2022: పాఠశాల విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసిన ‘మేరు ఇంటర్నేషనల్ స్కూల్’ ఇంటర్ స్కూల్ ఫెస్ట్ ‘మేరూత్సవ్’

పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి, ఆలోచనా శక్తిని పెంచేందుకు నిర్వహించిన ‘మేరు ఇంటర్నేషనల్ స్కూల్’ 3వ వార్షిక ఇంటర్ స్కూల్ ఫెస్ట్ ‘మేరూత్సవ్’ ముగిసింది. ఈ ఏడాది జూలై 20 నుంచి ఆగస్టు 10 వరకు జరిగిన ‘మేరూత్సవ్’లో హైదరాబాద్‌లోని 26 ప్రముఖ పాఠశాలల నుంచి మొత్తం 3,800కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 70 ఈవెంట్లకు సంబంధించి వ్యక్తిగతంగా విద్యార్థులకు ఈ పోటీల్లో మొత్తం 500కుపైగా అవార్డులు అందించారు. స్వర్ణ, రజత పతకాల రూపంలో ఈ అవార్డులు ప్రదానం చేశారు. అలాగే, అన్ని ఈవెంట్లలో వచ్చిన మొత్తం పాయింట్ల ఆధారంగా టాప్-3 పాఠశాలలకు కూడా అవార్డులు అందించారు. పథమ స్థానంలో ఫీనిక్స్ గ్రీన్స్ స్కూల్, ద్వితీయ స్థానంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, తృతీయ స్థానంలో ది శ్రీరాం యూనివర్సల్ స్కూల్ నిలిచాయి.

Meru International School’s Merutsav-2022

Meru International School’s Merutsav-2022: పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి, ఆలోచనా శక్తిని పెంచేందుకు నిర్వహించిన ‘మేరు ఇంటర్నేషనల్ స్కూల్’ 3వ వార్షిక ఇంటర్ స్కూల్ ఫెస్ట్ ‘మేరూత్సవ్’ ముగిసింది. ఈ ఏడాది జూలై 20 నుంచి ఆగస్టు 10 వరకు జరిగిన ‘మేరూత్సవ్’లో హైదరాబాద్‌లోని 26 ప్రముఖ పాఠశాలల నుంచి మొత్తం 3,800కి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ‘మేరూత్సవ్’ను తొలిసారి 2020లో ప్రారంభించారు. అయితే, కరోనా విజృంభణ నేపథ్యంలో 2020తో పాటు 2021లో వర్చువల్ పద్ధతిలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సారి మాత్రం హైదరాబాద్‌లోని మేరు ఇంటర్నేషనల్ స్కూల్స్ వద్ద ఈ పోటీలు నిర్వహించారు.

మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌తో పాటు గ్లెన్‌డేల్ అకాడమీ ఇంటర్నేషనల్, హిందూ పబ్లిక్ స్కూల్, సాంక్టామేరియా ఇంటర్నేషనల్ స్కూల్‌, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌, చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి ప్రముఖ స్కూళ్ళ విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు నిర్వహించిన ఈ ఫెస్ట్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా కూడా లైవ్‌లో ప్రసారం చేశారు. ఈ ఇంటర్‌స్కూల్ పాఠశాలల పోటీల్లో ప్రీ స్కూల్ నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం 70కి పైగా ఈవెంట్లను నిర్వహించారు.

సంగీతం, క్రీడలు, టెక్ వంటి 10 విభిన్న కేటగిరీల్లో ఈ పోటీలు జరిగాయి. హెచ్‌టీఎంఎల్ కోడింగ్, స్టూడెంట్ రిపోర్టర్, న్యూస్ రిపోర్టర్, టినీ షెఫ్, తెలుగులోనూ వక్తృత్వ పోటీలు వంటి ఈవెంట్లను నిర్వహించారు. మొత్తం 70 ఈవెంట్లకు సంబంధించి వ్యక్తిగతంగా విద్యార్థులకు ఈ పోటీల్లో మొత్తం 500కుపైగా అవార్డులు అందించారు. స్వర్ణ, రజత పతకాల రూపంలో ఈ అవార్డులు ప్రదానం చేశారు. అలాగే, అన్ని ఈవెంట్లలో వచ్చిన మొత్తం పాయింట్ల ఆధారంగా టాప్-3 పాఠశాలలకు కూడా అవార్డులు అందించారు. పథమ స్థానంలో ఫీనిక్స్ గ్రీన్స్ స్కూల్, ద్వితీయ స్థానంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, తృతీయ స్థానంలో ది శ్రీరాం యూనివర్సల్ స్కూల్ నిలిచాయి.

‘మేరూత్సవ్-2022’ విజయవంతంగా ముగిసిందని ‘మేరు ఇంటర్నేషనల్ స్కూల్’ తెలిపింది. విద్యార్థులు ఈ ఫెస్ట్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొంది. వచ్చే ఏడాది నిర్వహించే ‘మేరూత్సవ్’ మరింత ఘనంగా జరుగుతుందని చెప్పింది. కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ), కేంబ్రిడ్జ్ అసెస్మెంట్స్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అనుబంధ పాఠశాల ‘మేరు ఇంటర్నేషనల్ స్కూల్’ను 2017, జూలై 19న మేఘన రావ్ జూపల్లి స్థాపించారు. విద్యార్థులు విభిన్న రంగాల్లో రాణించేందుకు ‘మేరు ఇంటర్నేషనల్ స్కూల్’ ఉత్తమ విధానాలను అవలంబిస్తోంది. మేరు కెరీర్ రీడ్‌నెస్ లీడర్ షిప్ అకాడమిక్ ప్రోగ్రాం (ఎం-క్లాప్) ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, చదువులో రాణించేలా ప్రోత్సహిస్తోంది.