నేడూ, రేపు ఎండలు : హైదరాబాద్‌లో 40.6 డిగ్రీలు

  • Publish Date - April 26, 2019 / 12:41 AM IST

తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొన్ని రోజులుగా వర్షాలతో సేద తీరిన ప్రజలు ప్రస్తుతం దంచికొడుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రోజుకో ఒక డిగ్రీ చొప్పున అధికమౌతున్నాయి. సాధారణం కన్నా అధికంగా టెంపరేచర్స్ నమోదవుతుండడంతో ఎండ తీవ్రతకు ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఏప్రిల్ 26 శుక్రవారం, ఏప్రిల్ 27 శనివారాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఏప్రిల్ 25వ తేదీ గురువారం ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. హైదరాబాద్‌లో 40.6 డిగ్రీలు, ఖమ్మంలో 41.6 డిగ్రీలు, నిజామాబాద్‌లో 43.5, మెదక్‌లో 42 డిగ్రీలు, నల్గొండలో 41.8, రామగుండంలో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు సూచిస్తున్నారు.