Weather Update : రెండు రోజులూ పొడి వాతావరణం

  • Publish Date - February 17, 2019 / 01:09 AM IST

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులూ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి తెలంగాణ వరకు…తమిళనాడు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపారు. అయితే..దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఉండదన్నారు. 

మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే 2 – 3 డిగ్రీల వరకు అధికంగా రికార్డయ్యాయి. గత 24గంటల్లో మెదక్, మహబూబ్ నగర్‌ జిల్లాల్లో 36 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్, భద్రాచలంలో 35 డిగ్రీలు, రామగుండం, హైదరాబాద్, ఆదిలాబాద్‌లలో 34 డిగ్రీలు చొప్పున టెంపరేచర్స్ నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇంకోవైపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. సిరిసిల్ల, మెట్ పల్లి, మల్యాల్, లింగపేపట, పెగడపల్లి, చేగుట్టలలో వర్షం పడింది. దీనివల్ల రైతులు నష్టపోయారు. పండిన పంట నీటమట్టమై పోవడంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు. 

ట్రెండింగ్ వార్తలు