ఆధారాలుంటే జైలుకు పంపండి : ఉత్తమ్ 

  • Publish Date - November 17, 2019 / 01:38 PM IST

ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మపై కాంగ్రెస్ ఎంపీ , టీపీసీసీ చీఫ్  ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు , కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని  కూల్చేందుకు  కుట్ర  పన్నాయన్న ఆరోపణలను ఆయన ఖండించారు.   కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబధ్దంగానే పోరాడుతోందని 

అందుకు తగిన ఆధారాలు ఉంటే  జైలుకు పంపించాలని అన్నారు. కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన సునీల్ శర్మను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని న్యాయమూర్తి సుమోటోగా స్వీకరించాలని కోరారు. సునీల్ శర్మపై డివోపిటికి ఫిర్యాదు చేస్తామన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యను పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ సమ్మె పై చర్చించడానికి సీఎం కేసీఆర్ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని  ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి కైనా కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని ఉత్తమ్ డిమాండ్ చేసారు. నవంబర్ 19న  జరిగే  సడక్ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు మద్దతివ్వాలని ఆయన కోరారు.