త్రిముఖ పోరు : ఆ నియోజకవర్గాల్లో BJP పోటీ ఎవరికి నష్టం

పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. తమ పార్టీల అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్నారు.

  • Publish Date - April 1, 2019 / 01:55 PM IST

పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. తమ పార్టీల అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. తమ పార్టీల అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్నారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలుంటే.. ఎక్కువ ప్లేసుల్లో టీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్యే ద్విముఖ పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం త్రిముఖ పోరు జరుగనుంది. సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్ స్థానాల్లో హోరాహోరీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ – కాంగ్రెస్ – బీజేపీ నుంచి బలమైన అభ్యర్థులు పోటీలో ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. ఈ ప్రాంతాల్లో గెలుపు తమదే అంటూ మూడు ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి.
Read Also : పవన్ హామీలు : స్టూడెంట్స్‌కి ల్యాప్ టాప్.. ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం

నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి, ఆదిలాబాద్, పెద్దపల్లి, చేవెళ్ల, జహీరాబాద్, మెదక్, నాగర్‌కర్నూల్ స్థానాల్లో ద్విముఖ పోటీ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో తప్ప.. మిగతా ప్లేసుల్లో టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పోటీ ఇవ్వలేకపోయింది. అటు బీజేపీ కనీసం డిపాజిట్లు కూడా దక్కక బొక్కబోర్లా పడింది. 

సికింద్రాబాద్‌లో రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. టీఆర్ఎస్ నుంచి తలసాని సాయికిరణ్.. కాంగ్రెస్ అభ్యర్థిగా అంజన్‌కుమార్ యాదవ్, బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి బరిలో ఉన్నారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలుంటే.. అందులో ఆరింటిని టీఆర్ఎస్ గెల్చుకుంది. సికింద్రాబాద్ బీజేపీకి సిట్టింగ్ స్థానం. గత ఎన్నికల్లో రెండున్నర లక్షల మెజారిటీ వచ్చినా.. ఈసారి దత్తాత్రేయ కాకుండా కిషన్‌‌రెడ్డి బరిలో ఉండటంతో సామాజికవర్గాల లెక్కలు తెరపైకి వస్తున్నాయి. 

మల్కాజిగిరిలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య టఫ్ ఫైట్ ఉండొచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇక్కడ బీజేపీ గణనీయమైన ఓట్లనే సాధించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో లక్షకు పైగా ఓట్లు సాధించింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాల్లో కమలం పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు గట్టి సవాలే విసురుతోంది. అంతే కాకుండా.. 17 స్థానాల్లో పోటీ చేస్తున్నా.. ఐదు సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా వ్యూహాలు రచిస్తుంటే.. టీఆర్ఎస్ – కాంగ్రెస్‌లో ఏ పార్టీకి నష్టం కలుగుతుందనే చర్చ తెలంగాణలో జరుగుతోంది. 
Read Also : మే 23 తర్వాత : కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం