బండి సంజయ్ కారుపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

  • Publish Date - November 30, 2020 / 10:34 PM IST

trs activists destroyed bjp state president bandi sanjay car : టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల ఘర్షణతో నెక్లెస్ రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కారుపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. నెక్లెస్ రోడ్డులోని ఒక రెస్టారెంట్ వద్దకు వచ్చిన ఆయన కారును ఖైరతాబాజ్ టీఆర్ఎస్ కార్పోరేటర్ అభ్యర్ధిని విజయారెడ్డి అడ్డుకున్నారు. అప్పటికే అక్కడి బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు.

ఒకానోక దశలో రెండు పార్లీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో పరిస్ధితి అదుపు తప్పేలా కనిపించింది. ఈ క్రమంలో బండి సంజయ్ కారు అనుకుని వేరే బీజేపీ నాయకుని కారను టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పోలీసులు ఇరువర్గాలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. పరిస్ధితి చేయదాటకుండా అదనపు పోలీసు బలగాలను అక్కడకు తరలించారు. పోలీసులు బండి సంజయ్ ను వేరే కారులో సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.



అయితే రెండు పార్టీల కార్యకర్తలు ఢీ అంటే ఢీ అనుకోవటంతో ఏం జరుగుతుందోనని అందరూ టెన్షన్ పడ్డారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో బీజేపీ వాళ్లు అలజడి సృష్టించాలని చూస్తున్నారని….. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవటంతో తానే బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకోటానికి ప్రయత్నించానని ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పోరేటర్ అభ్యర్ధిని విజయారెడ్డి అన్నారు.



ట్రెండింగ్ వార్తలు