యూనివర్సిటీ విషయంలో మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ సభ్యుడు బాల్కా సుమన్ కౌంటర్ ఇచ్చారు. విద్యార్థులకు అన్యాయం చేస్తున్నట్లు మాట్లాడడం అన్యాయమన్నారు. తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం కొనసాగాయి. ఈ సందర్భంగా బడ్జెట్‌పై ప్రసంగించిన మల్లు భట్టి విక్రమార్క..ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు.
PHD స్కాలర్స్ కోసం అప్పట్లో యూజీసీ ఛైర్మన్‌గా ఉన్న తోరటి ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ ఫెలోషిప్ స్కీం తీసుకొచ్చారని గుర్తు చేశారు. మొదటి మూడు సంవత్సరాల వారికి నెలకు రూ. 27 వేలు (జూనియర్ ఫెలోషిప్), మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత (సీనియర్ ఫెలోషిప్) నెలకు రూ. 30 వేలు వస్తాయని సభలో వెల్లడించారు. కానీ..ఉద్దేశ్యపూర్వకంగా మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం..ఈ స్కీంపై రకరకాల కండీషన్స్ పెట్టిందన్న విషయాన్ని గుర్తు చేశారు బాల్కా సుమన్.
గత మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఆనాడు పార్లమెంట్ మెంబర్స్‌గా ఉన్న సమయంలో కేంద్ర మంత్రులకు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అంటే..తమకు సంబంధం లేని అంశం..బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించాల్సింది పోయి..రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్టు కాదని మల్లు భట్టి విక్రమార్కకు సూచించారు.
Read More : టి.అసెంబ్లీ : బాల్కాసుమన్ విద్యార్థి నాయకుడా – మల్లు భట్టి