Get Well Soon : KTRకి కండ్లకలక

నల్లటి కళ్లద్దాలు..బ్లూ కలర్ టీ షర్ట్..తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడంట్ కేటీఆర్ దర్శనమివ్వడంతో ఏ సూపర్ అని ఆయన ఫ్యాన్స్ అనుకుని ట్వీట్‌ని పూర్తిగా పరిశీలిస్తే కాని అసలు విషయం అర్థం కాలేదు.

  • Publish Date - April 16, 2019 / 12:38 PM IST

నల్లటి కళ్లద్దాలు..బ్లూ కలర్ టీ షర్ట్..తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడంట్ కేటీఆర్ దర్శనమివ్వడంతో ఏ సూపర్ అని ఆయన ఫ్యాన్స్ అనుకుని ట్వీట్‌ని పూర్తిగా పరిశీలిస్తే కాని అసలు విషయం అర్థం కాలేదు.

నల్లటి కళ్లద్దాలు..బ్లూ కలర్ టీ షర్ట్..తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడంట్ కేటీఆర్ దర్శనమివ్వడంతో ఏ సూపర్ అని ఆయన ఫ్యాన్స్ అనుకుని ట్వీట్‌ని పూర్తిగా పరిశీలిస్తే కాని అసలు విషయం అర్థం కాలేదు. కేటీఆర్‌కు కండ్లకలక సోకిందని..విశ్రాంతి తీసుకుంటున్నారని అర్థమైంది. తనకు కండ్లకలక సోకిందని..మూడు – నాలుగు రోజులు రెస్టు తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు కేటీఆర్..ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. 
Read Also : ఇక పోదాం పదండీ : చంద్రుడిపై నీళ్లు ఉన్నాయి

ఏప్రిల్ 15వ తేదీ TRS పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరు కాలేదు. ఉదయం మాత్రం ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఆ సమయంలో కళ్లు ఇబ్బందిగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు ఆయన్ను పరీక్షించారు. కండ్ల కలక సోకిందని నిర్ధారించారు. చికిత్స చేసిన వైద్యులు రెస్టు తీసుకోవాలని సూచించారు. దీంతో కేటీఆర్ తన నివాసంలో విశ్రాంతి తీసుకున్నారు.

విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు కేటీఆర్. త్వరగా కోలుకోవాలన్నారు నెటిజన్లు. గెట్ వెల్ సూన్ అన్నా అంటూ కొందరు ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉధృతంగా పర్యటించిన కేటీఆర్..పోలింగ్ ముగిసిన తరువాత తన కొడుకును హగ్ చేసుకున్న ఫొటోను ఆయన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్