కేటీఆర్ ట్వీట్‌: ఏపీలో ముఖ్యమంత్రి ఎవరంటే? 

  • Publish Date - April 28, 2019 / 09:52 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ జగన్ తప్పక గెలుస్తాడంటూ చెప్పిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెటిజన్లతో #askktr అనే కార్యక్రమంలో భాగంగా ట్విట్టర్‌లో మాట్లాడిన కేటిఆర్.. ఆన్‌లైన్‌లో నెటిజన్లు అడిగే ప్రతీ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలు ఇస్తూ ఉన్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఏపీ రాజకీయాల గురించి కూడా నెటిజన్లు కేటిఆర్‌కు ప్రశ్నలు సందించారు. చిట్‌చాట్‌లో భాగంగా ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఏ పార్టీ గెలుస్తుంది? అని అడిగారు.

అందుకు సమాధానం ఇచ్చిన కేటీఆర్.. ‘నాకు ఏపీ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు’ అనే సమాధానం ఇచ్చారు. అలాగే జగన్ ఏపీ సీఎం అవుతారా అని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నించగా.. తెలియదు.. ఏపీ ప్రజలు ఎలాంటి నిర్ణయం ఇస్తారో వేచి చూడాలి అని అన్నారు. ఏపీలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా పోటీ చేసిన ఎంఎల్ఏలలో ఎవరో ఒకరు అవుతారంటూ సరదాగా సమాధానం ఇచ్చారు.

జగన్‌కు మద్దతిస్తూ కేటీఆర్, సీఎం కేసీఆర్ అనేక సార్లు వ్యాఖ్యలు చేయగా ఎన్నికల తర్వాత అందుకు భిన్నంగా మాట్లాడడం విశేషం. ఓవైపు జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడంటూ నమ్మకంగా చెబుతుంటే కేటిఆర్ నమ్మకంగా చెప్పకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.