విదేశాల నుంచి వచ్చిన వ్యాధికాబట్టి, విమానాశ్రాయాలు, పోర్టులు మూసేశాం. జనాతా కర్ఫ్యూ, లాక్ డౌన్ తో కట్టడి చేశాం. దేశం విజయవంతమైంది. దేశం సేఫ్. అదే అమెరికాలో శవాలు గుట్టలు పేరుకొంటున్నాయి. హృదయవిదాకరమైన వార్తలు వింటున్నాం. శవాలను ట్రక్కుల్లో పంపుతున్నారు. దయనీయం. అంత పవరువున్న దేశమే అల్లల్లాడింది. అలాంటి పరిస్థితి మనకు వచ్చుంటే కోట్ల చనిపోయేవాళ్లు.
లాక్ డౌన్ లో భాగంలో ప్రజలు సహకరించారు. ఇది మానవజాతికి పట్టన పీడ. సంక్షోభం. 22 దేశాలు లాక్ డౌన్ లో ఉన్నాయి. జపాన్, సింగపూర్, పోలండ్, బ్రటన్, జర్మనీ, పెరు, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్, నేపాల్ లాంటి దేశాలు కంప్లీట్ లాక్ డౌన్. 90 దేశాల్లో పాక్షికంగా లాక్‌డౌన్ ఉంది. నిజానికి, ఇది మంచి నిర్ణయం. ఇంతమందిని రక్షించుకున్నామంటే కారణం లాక్ డౌన్. అమెరికాలాంటి దేశమే అతలాకుతలైపోయింది.
BCG ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జూన్ 3నాటికి కరోనా శిఖరాన్ని చేరుతుంది. ఇదో హెచ్చరిక. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలాంటి దేశానికి లాక్ డౌన్ పాటించడం తప్ప మరో గత్యంతరం లేదు. ఎకానమి దెబ్బతింటుంది. అయినా తప్పదు.
తెలంగాణకు రోజుకు 450 కోట్లవరకు ఆదాయమొస్తుంది. ఈ ఆరు రోజుల్లో 2400కోట్లు రావాలి. వచ్చింది ఆరుకోట్లు. మార్చి 15తర్వాత ఆదాయం జీరో. అయినా తప్పదు. అందుకే లాక్ డౌన్ మినహా మరో ప్రత్యమ్నాయం లేదు. అందుకే లాక్ డౌన్ ను కొనసాగించడమని ప్రధాని మోడీని నేను చెప్పా.