కార్మికుల సుదీర్ఘమైన సమ్మెతో గ్రేటర్ ఆర్టీసీ కుదేలైంది. పీకల్లోతు నష్టాల్లోకి మునుగుతోంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. 2019 నవంబర్ 14వ తేదీకి 41 రోజుకు చేరుకుంది. నిరవధిక సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ప్రైవేట్ సిబ్బందిని నియమించుకున్నారు. కానీ 50 శాతం బస్సులను కూడా నడపలేని పరిస్థితి నెలకొంది. దీంతో గడిచిన 40 రోజులుగా గ్రేటర్ ఆర్టీసీ భారీ నష్టాలను చవి చూస్తోంది. సాధారణంగానే ప్రతి రోజు రూ.కోటి చొప్పున నష్టాలు చోటుచేసుకొనేవి. రోజుకు రూ.2.5 కోట్ల ఆదాయం లభిస్తే నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.3.5 కోట్ల వరకు ఉండేవి. ప్రస్తుతం సమ్మె రోజుల్లో అది రెట్టింపైంది.
ఇదిలా ఉంటే..ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈ నెల 18కి హైకోర్టు వాయిదా వేసింది. ఆర్టీసీ సమ్మెపై జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. ఆర్టీసీ సమస్యను తొందరగా పరిష్కరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ రాపోలు భాస్కర్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇప్పటివరకు 27మంది కార్మికులు చనిపోయారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
మరోవైపు…ఆర్టీసీ సమ్మె భవిష్యత్‌పై జేఏసీ, అఖిలపక్ష నేతలు మరోసారి భేటీకానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే ఈనెల 18న సమ్మెపై హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో.. అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేయనున్నారు నేతలు.
Read More : ఆర్టీసీ సమ్మె : ఆగిన మరో గుండె