ఆర్టీసీ సమ్మె 21వ రోజు : బస్సులు అరకొర..ప్రయాణీకుల తిప్పలు

  • Publish Date - October 25, 2019 / 02:18 AM IST

ఆర్టీసీ సమ్మె 21వ రోజుకు చేరుకుంది. అక్టోబర్ 05 నుంచి కార్మికులు సమ్మెలో ఉన్న సంగతి తెలిసిందే. అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు పట్టువీడకపోతుండడంతో ప్రతిష్టంభన నెలకొంది. కోర్టు కూడా పలు సూచనలు చేసింది. హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం నియమించిన ఆరుగురు ఆర్టీసీ అధికారుల బృందం కార్మికుల డిమాండ్లలోని 21 అంశాల అమలు సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేపట్టారు. అయితే..అరకొరగా బస్సులు ఉంటుండడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉదయం ఎలాగో..అలాగో నెట్టుకొచ్చినా..సాయంత్రం మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.

అరకొరగా బస్సులు ఉంటుండడంతో గమ్యస్థానాలకు చేరుకోవడానికి జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. తాత్కాలిక సిబ్బంది ఉదయం విధుల్లో చేరి..సాయంత్రానికి దిగిపోతున్నారు. తెల్లవారుజామున తిరిగిన బస్సులు సాయంత్రం 6 దాటిన తర్వాత రోడ్డుపైకి రావడం లేదు. సాయంత్రం విధులు ముగించుకుని ఇళ్లకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా ప్రయాణీకులు అసహనం కోల్పోతున్నారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. 

గ్రేటర్ పరిదిలో సుమారు 3 వేల 550 బస్సులకు గాను..1200లోపే తిరుగుతున్నట్లు అంచనా. 20 రోజులైనా సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రయాణీుకులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసీఎల్, మల్కాజ్ గిరి, కాప్రా, మౌలాలీ ప్రాంతాల్లోని కొన్ని కాలనీలకు బస్సే దిక్కు. ఉదయం ఏదో విధంగా కార్యాలయాలు, విద్యాలయాలకు వెళుతున్న ప్రయాణీకులకు సాయంత్రం ఇబ్బందుకరుల పరిస్థితి ఎదురవుతోంది. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. 
Read More : వెదర్ అప్ డేట్ : తేలిక పాటి వర్షాలు పడుతాయి