టీటీడీ బోర్డు సభ్యులు వీరే

  • Publish Date - September 17, 2019 / 09:07 AM IST

టీటీడీ బోర్డు నియామకం ఎదురుచూపులకు ఏపీ సర్కార్ ఎండ్‌ కార్డు వేసింది. టీటీడీ పాలకమండలిలో ఎవరెవరికి చోటు కల్పిస్తారన్న సస్పెన్స్‌కు తెరదించుతూ  జంబో టీమ్‌ను ప్రకటించింది. దీనిపై తీవ్ర కసరత్తు చేసిన ఏపీ సర్కార్‌.. ఎట్టకేలకు 28మందితో ఆ జాబితాను వెల్లడించింది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ వాసులతోపాటు ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర వాసులకు కూడా పాలకమండలిలో చోటు కల్పించింది. మొత్తంగా ఛైర్మన్‌తో కలిపి 29మందితో టీటీడీ బోర్డు ఏర్పాటయింది.

ఏపీ నుంచి 8 మందికి పాలకమండలిలో చోటు కల్పించారు. వీరిలో యువి రమణమూర్తి (ఎమ్మెల్యే), మల్లికార్జునరెడ్డి (ఎమ్మెల్యే), గొల్ల బాబూరావు(ఎమ్మెల్యే), నాదెండ్ల సుబ్బారావు, డీపీ అనంత, చిప్పగిరి ప్రసాద్‌ కుమార్‌, కె.పార్థసారధి, ఎమ్మెల్యే.

తెలంగాణ నుంచి జూపల్లి రామేశ్వరరావు(పారిశ్రామికవేత్త), బి.పార్థసారధి రెడ్డి, యు.వెంకట భాస్కరరావు, మూరంశెట్టి రాములు, డి.దామోదరరావు, కె.శివకుమార్‌, పుట్టా ప్రతాపరెడ్డి

తమిళనాడు నుంచి కృష్ణమూర్తి వైద్యనాథన్‌, ఎస్‌.శ్రీనివాసన్‌, డాక్టర్‌ నిచిత ముత్తవరపు, కుమార గురు(ఎమ్మెల్యే), 

ఢిల్లీ నుంచి ఎమ్‌ఎస్‌ శివ శంకరన్‌

కర్నాటక నుంచి రమేశ్‌ శెట్టి, సంపత్‌ రవి నారాయణ, సుధా నారాయణ మూర్తి, 

మహారాష్ట్ర నుంచి రాజేశ్‌ శర్మ, 

ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా తుడా ఛైర్మన్‌, దేవాదాయ శాఖ స్పెషల్ సెక్రటరీ, దేవాదాయ కమిషనర్‌, టీటీడీ ఈవో ఉంటారు.