జంటనగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. బారులు తీరిన వాహనాలు నిత్యం కనిపిస్తుంటాయి. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు రాజ్యమేలుతున్నాయి. తాము వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. అయితే..కొంతమంది నెట్ సౌకర్యం లేని వారు..సాధారణమైన ఫోన్లు ఉపయోగిస్తున్న వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వీరిపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. బయలుదేరే అర గంట ముందే..ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఎలా ఉందనేది వారి వారి సెల్ ఫోన్లకు సమాచారం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇంట్రస్ట్ ఉన్న వారు ఫోన్ నెంబర్లను ట్రాఫిక్ పోలీసు అధికారులకు ఇస్తే..మెసేజ్‌స్ వచ్చేస్తాయి. త్వరలోనే ఆ నెంబర్‌ను ప్రకటించనున్నారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రించాలని పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కొంతమేర ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ – బేగంపేట, జూబ్లీహిల్స్, ఆబిడ్స్ – లకడీకపూల్, ఖైరతాబాద్, అమీర్ పేట, టోలీచౌకి, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పరిపాటై పోయింది. త్వరలోనే ట్రాఫిక్ పోలీసులు అందించే ఈ సౌకర్యాన్ని ఉఫయోగించుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొనే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే..వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా…. లోపాలపై నగర పోలీస్ బాస్ అంజనీకుమార్ దృష్టిపెట్టారు. జీహెచ్‌ఎంసీ రోడ్ అండ్ సేఫ్టీ విభాగం అధికారులు, నగర ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఆయన సంయుక్తంగా పర్యవేక్షించారు. నగరంలోని ప్రధాన జంక్షన్‌లు, సిగ్నల్స్, యూటర్న్‌లు ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ట్రాఫిక్ తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.
Read More : మందుల కుంభకోణం : ESI డైరెక్టర్ దేవికారాణి అరెస్టు