హైదరాబాద్ ఎర్రగడ్డలో చైనా యువతులు కలకలం 

చైనా పేరు చెపితే చాలు జనం భయంతో వణికిపోతున్నారు. వూహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని ఎలా భయపెడుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు.  కరోనా లాక్ డౌన్  వల్ల ఎంత మంది ఎన్నిరకాలుగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఇక చైనా వాళ్లు కనిపిస్తే వణికిపోవటమే….గురువారం రాత్రి హైదరాబాద్ లో అదే జరిగింది.

నగరమంతా లాక్ డౌన్ లో ప్రశాంతంగా ఉన్నవేళ  ఎర్రగడ్డ  పోలీసు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు….మూసాపేట వైపు వెళుతున్న ఒక కారును ఆపారు. అందులో  ముగ్గురు యువతులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఇద్దరు చైనా వారు కాగా మరోక యువతి నాగాలాండ్ కు చెందినదిగా గుర్తించారు. స్ధానికంగా ఈ వార్త కలకలం రేపింది.

చైనా యువతులు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు, ఏపని మీద వచ్చారు మొదలైన విషయాలు పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు వారిని  వైద్య పరీక్షలనిమిత్తం  క్వారంటైన్ కు  తరలించారు.