రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమా ఫక్కీలో రెండు స్టూడెంట్స్ గ్రూప్‌లు హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో కొట్టుకుని బీభత్సం సృష్టించాయి. పట్టపగలు, నడిరోడ్డుపై హాకీ స్టిక్కులు, కర్రలతో విద్యార్ధులు కొట్టుకోవడం స్థానికంగా కలకలం రేపుతుంది. పది మంది స్టూడెంట్లు ఒకరిపై ఒకరు హీకీ స్టిక్‌లు, రాడ్లుతో కొట్టుకున్నారు. రోడ్డు డివైడర్‌కు అటూ ఇటూ రాళ్లు విసురుకుంటూ బండ్లు విరక్కొడుతూ బైక్స్ ను ఢీకొట్టుకుని మరీ రోడ్డుపై బీభత్సం చేశారు.
రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవ అక్కడి సీసీ టీవీల్లో క్లియర్‌గా కనిపిస్తుంది. విద్యార్థుల దాడిలో రోడ్డుపై వెళుతున్న ఓ మహిళ కూడా గాయపడింది. గొడవ పెట్టుకున్న విద్యార్ధులు ఫార్చున్ విద్యా సంస్థల స్టూడెంట్స్‌గా చెబుతున్నారు.
స్టూడెంట్స్ మధ్య జరిగిన గొడవకు కారణం ఓ అమ్మాయి విషయంలో తలెత్తిన ప్రేమ వ్యవహారంగా తెలుస్తోంది. ఓ గ్రూప్ కు చెందిన కుర్రోడు.. మరో గ్యాంగ్ లోని అమ్మాయిని ప్రేమించడం.. వెంటపడటం వలనే ఆ గ్రూప్ మరో గ్రూప్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది. కాగా సీసీఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.