మహా విషాదం : దొరకని యువ ఇంజనీర్ల ఆచూకీ..రెండు గ్రామాల్లో విషాదం

  • Publish Date - September 16, 2019 / 05:27 AM IST

పాపికొండలు విహార యాత్రకు వెళ్లి బోటు ప్రమాదంలో గల్లంతు అయిన వారిలో యువ ఇంజినీర్లు ఉన్నారు. ఆచూకీ తెలియడం లేదన్న సమాచారం తెలియడంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారికి ఏమి కావొద్దని..క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.  

మంచిర్యాల జిల్లాల నంనూర్ గ్రామానికి చెందిన కారుకురి సుదర్శన్..భూమక్క దంపతుల కూతురు రమ్యశ్రీ..ఇటీవలే విద్యుత్ శాఖలో ఏఈగా జాబ్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. విహార యాత్రకు వెళ్లొస్తానన్న రమ్య..స్నేహితులతో పాపికొండలకు వెళ్లింది.

కర్ణమామిడి గ్రామానికి చెందిన రామయ్య – శాంతమ్మల మూడో కుమారుడు బోద్ది లక్ష్మణ్ ఇటీవలే విద్యుత్ శాఖలో ఏఈఈగా ఉద్యోగం వచ్చింది. విహార యాత్రకు వెళ్లేందుకు లక్ష్మణ్ నిర్ణయించుకుని విషయాన్ని పేరెంట్స్‌కు తెలియచేశాడు. అనంతరం వరంగల్‌కు వెళ్లి..స్నేహితులతో కలిసి పాపికొండలకు వెళ్లాడు.  

సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం వీరు ప్రయాణం చేస్తున్న బోటు మునిగిపోయింది. వీరిద్దరూ గల్లంతు కావడంతో ఇరు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన జరిగిన అనంతరం రెస్క్యూ టీం గాలింపులు చేపడుతోంది. ఆదివారం రాత్రి వరకు కూడా ఈ యువ ఇంజనీర్ల ఆచూకి తెలియరాలేదు. దీంతో ఇరు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం ఇరు కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లారు.