హైదరాబాద్: ఏప్రిల్ 11న జరుగనున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా, ఈ ఏడాది ఉగాది వేడుకలను ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఉన్న ప్రగతి భవన్‌లో జరపడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అనుమతితో – ముఖ్యమంత్రి నివాస కార్యాలయం మినహా ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మరెక్కడయినా జరుపుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం తెలియ చేసింది. ఉగాది వేడుకలు జరిగే ప్రదేశాల్లో నమూనా ప్రవర్తనా నియమావళిని సంపూర్ణంగా, కఠినంగా అమలు జరిగేటట్లు చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ర్ట ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి స్పష్టం చేసింది.