Underground Metro In Hyderabad : హైదరాబాద్‌లో తొలిసారి అండర్ గ్రౌండ్ మెట్రో

భాగ్యనగరం కీర్తి అంతర్జాతీయ స్థాయికి తెలిసేలా మరో అడుగు పడనుంది. అదే అండర్ గ్రౌండ్ మెట్రో రైలు. ప్రయాణీకులు నేరుగా ఎయిర్ పోర్టు బోర్డింగ్ పాయింట్స్ కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.ప్రపంచస్థాయి సౌకర్యాలతో హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

Underground metro In Hyderabad : భాగ్యనగరం కీర్తి అంతర్జాతీయ స్థాయికి తెలిసేలా మరో అడుగు పడనుంది. అదే అండర్ గ్రౌండ్ మెట్రో రైలు. ప్రయాణీకులు నేరుగా ఎయిర్ పోర్టు బోర్డింగ్ పాయింట్స్ కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.ప్రపంచస్థాయి సౌకర్యాలతో హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మెట్రో రెండోదశ విస్తరణ పనుల్లో భాగంగా ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీంట్లో భాగంగా భూగర్భ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనున్నారు.హైదరాబాద్ మెట్రో ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వించిన వేడుకల్లో భూగర్బ మెట్రో ఎలా ఉంటుందో వివరించారు మెట్రో ఎండీ ఎన్వీవీఎస్ రెడ్డి. హైదరాబాద్ లో ఏప్రాంతంనుంచి అయినా ఎయిర్ పోర్టుకు వెళ్లేలా కొత్త మెట్రో రైలును నిర్మించనున్నారు.

రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు రెండో దశలో 31 కిలోమీటర్లు చేపట్టనున్న మెట్రో కారిడార్‌లో విమానాశ్రయం సమీపంలో 27.5 కిలోమీటర్లు ఉపరితల మెట్రో,సుమారు 3కిలోమీటర్లు అండర్గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నారు. ఈ మెట్రో కారిడార్‌కు రూ. 6,250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రెండో దశ నిర్మాణానికి డిసెంబర్ 9 న ముహూర్తం నిర్ణయించారు.

కాగా.. హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మెట్రోరైలు మొదటి దశను నవంబర్ 2017 లో నాగోల్ – అమీర్‌పేట – మియాపూర్ మార్గంతో ప్రారంభించారు. తరువాత ఎల్‌బీ నగర్-అమీర్ పేట మార్గం అక్టోబర్ 2018 లో ప్రారంభించారు. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గాన్ని మార్చి 2019 న ప్రారంభించారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరి 7న జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గం అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటితో మొదటి దశలో 69 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వచ్చింది.

 

ట్రెండింగ్ వార్తలు