కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా అంశాలకు నిరసనగా ప్రముఖ ఉర్దూ రచయిత, హాస్యవేత్త ముజ్తాబా హుస్సేన్ నేడు తన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు.
ఉర్దూ సాహిత్యంలో హుస్సేన్ కృషికి గుర్తింపుగా 2007లో భారత ప్రభుత్వం ఈ హైదరాబాద్ రచయితకు పద్మశ్రీ బిరుదును ప్రధానం చేసింది. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ..దేశంలో పరిస్థితి నానాటకీ దిగజారిపోతుంది. నా జీవితకాలంలో నేను ఇటువంటి సంఘటనను చూడలేదన్నారు.
సీఏఏ 2019 చట్టం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, వంటి దేశాల నుంచి మనదేశంలోకి ప్రవేశించిన శరణార్థులకు హిందూ, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, పార్శీ మొదలైన మతాల వారీగా భారతీయ పౌరసత్వాన్ని ఇవ్వటానికి ఉద్దేశించినది. ఇది డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారత్ లోకి ప్రవేశించినవారికి వర్తిస్తుంది.