దారుణ నిర్లక్ష్యం : వికటించిన వ్యాక్సిన్, 15మంది పిల్లలకు అస్వస్థత

  • Publish Date - March 7, 2019 / 06:38 AM IST

నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం తీసింది. అభంశుభం తెలియని పిల్లల ప్రాణాల మీదకు తెచ్చింది. నాంపల్లిలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో వాక్సిన్‌ తీసుకున్న చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన 15మంది చిన్నారులను నీలోఫర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వీరిలో ఒక చిన్నారి మృతి చెందాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వ్యాక్సిన్‌ తర్వాత నొప్పి నివారణ కోసం క్రోసిన్ మాత్ర ఇచ్చారు. దాంతో చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. పిల్లలు అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నీలోఫర్‌ ఆస్పత్రి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
Also Read: ముషార్రఫ్ సంచలన నిజాలు : జైషే,ISIలు కలిసి భారత్ లో ఉగ్రదాడులు చేశాయి

వ్యాక్సిన్‌ ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని నీలోఫర్‌ వైద్యులకు ఆదేశించారు. పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ లో 80మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేశారు. ఆ తర్వాత నొప్పి నివారణ కోసం క్రోసిన్ ట్యాబ్లెట్ ఇచ్చారు. ట్యాబ్లెట్ వేశాక పిల్లలు వాంతులు చేసుకున్నారు. కొందరికి ఫిట్స్ వచ్చాయి. దీంతో ఎక్స్ పైర్ అయిన ట్యాబ్లెట్ ఇచ్చారా? వ్యాక్సిన్ లో ఏమైనా లోపం ఉందా? మరో కారణమా? అనేది అధికారులు చెక్ చేస్తున్నారు.
Also Read: తమిళ మంత్రి సంచలన వ్యాఖ్యలు : అమ్మను.. హల్వా పెట్టి చంపేశారు