మన భవిష్యత్ కోసం: పవన్ కళ్యాణ్ కు విజయ్ దేవరకొండ సపోర్ట్

  • Publish Date - September 12, 2019 / 12:15 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడంతో ప్రాధాన్యత తెచ్చుకున్న నల్లమల యూరేనియం తవ్వకాల అంశంపై యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల కారణంగా 20వేల ఎకరాల నల్లమల అడవి నాశనమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటికే మనం నదులను, చెరువులను కలుషితం చేశాం. తాగేందుకు నీరు దొరకని పరిస్థితిలోకి వచ్చాం. గాలి, నీరు కలుషితమయ్యాయ్.. నగరాలు నీళ్లు లేక అల్లాడుతున్నాయి.

యురేనియం కొనుక్కోవచ్చు, అడవులను కొనగలమా..! అవసరం అయితే సోలార్ ఎనర్జీని వినియోగంలోకి తెచ్చుకుందాం. ప్రతి ఇంటి కప్పుపై సోలార్ ప్లేట్స్ ని ఏర్పాటు చేసే చట్టాలు చేద్దాం.. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు లేనప్పుడు ఎలక్ట్రిసిటీతో ఏమి చేసుకుంటాం…? మిగిలిన కొద్దిపాటి వనరులను కూడా నాశనం చేసి ఏం సాధిస్తాం. నల్లమలను కాపాడుకుందాం.. మనకోసం, మన భవిష్యత్ కోసం.. అంటూ సేవ్ నల్లమల క్యాంపెయిన్ కు మద్దతుగా ట్వీట్ చేశారు.

నల్లమలలో యూరేనియం తవ్వకాలను చేపట్టకూడదని, తవ్వకాలు చేపడితే పర్యావరణంలో సమతుల్యత లోపిస్తుందని, కొన్ని భవిష్యత్ తరాల ప్రజలు ఇబ్బందులు పడతారంటూ పవన్ కళ్యాణ్.. అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సేవ్ నల్లమల అంటూ ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నల్లమల అడవిని కాపాడుకోవడానికి ఆంధ్రా, తెలంగాణలోని అన్ని పార్టీలు ముందుకు రావాలని, నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపివేసే వరకు ఉద్యమం చేయాలని విజయ్ దేవరకొండ తన ట్వీట్ లో కోరారు.

ట్రెండింగ్ వార్తలు