11 గుర్తింపు కార్డులు : 31 నుండి ఓటర్ల స్పిప్పుల పంపిణీ

  • Publish Date - March 29, 2019 / 03:20 AM IST

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నిక నిర్వాహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఎన్నికల సంఘం పలు ఏర్పాట్లు చేస్తోంది. ఏ ఎన్నిక జరిగినా అక్కడక్కడ కొన్ని సమస్యలు ఏర్పడుతుంటాయి. ఓట్లు గల్లంతయ్యాయని.. ఓటర్ స్లిప్పులు అందలేదనే ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ఎన్నికలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా ముందస్తుగానే సమస్యలకు చెక్ పెట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ ఎం.దానకిషోర్ భావించారు.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష

అందులో భాగంగా మార్చి 31వ తేదీ నుండే హైదరాబాద్ జిల్లాల్లోని 41,77,703 ఓటర్లకు ఓటర్ల స్లిప్పులు అందచేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌కు ఐదు రోజుల ముందుగానే ఓటర్ల స్లిప్పుల పంపిణీ చేస్తున్నట్లు దానకిషోర్ వెల్లడించారు. ఓటర్ గుర్తింపు కార్డు లేకున్నా ఓటు వేయొచ్చన్నారు. 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు, పోలింగ్ కేంద్రాల్లో వారి గుర్తింపు నిర్దారణకు ఓటర్ స్లిప్పులను చూపితే సరిపోతుందని తెలిపారు. 

11 గుర్తింపు కార్డులు : – 
1. పాస్ పోర్టు 2. డ్రైవింగ్ లైసెన్స్ 3. ఫొటోతో కూడిన సర్వీస్ ఐడెంటిఫై కార్డు 4. ఫొటోతో కూడిన బ్యాంకు పాస్ బుక్ 5. పాన్ కార్డు 6. ఆర్.జి.ఐ 7. ఎస్.పి.ఆర్ స్మార్ట్ కార్డు 8. జాబ్ కార్డు 9. హెల్త్ కార్డు 10. ఫొటోతో కూడిన ఫించన్ డ్యాక్యుమెంట్ 11. ఎమ్మెల్యే, ఎంపీ ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం 12. ఆధార్ కార్డు
Read Also : ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు బ్రేక్

ట్రెండింగ్ వార్తలు