తెలుగు రాష్ట్రాల్లో ఎండలు సుర్రుమంటున్నాయి. సూర్యుడు మార్చి మాసంలోనే భగభగలాడిస్తున్నాడు. ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. పలు జిల్లాల్లో సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మార్చి 29వ తేదీ కూడా కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడం వల్ల రాష్ట్రంలో నేడు పొడి వాతావరణం ఏర్పడి అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.