వీడియో వైరల్: రాంగ్రూట్లోకి వచ్చి.. ఎలా బెదిరిస్తున్నారో చూడండి..
- vamsi
- Published on- April 20, 2019 / 05:32 AM IST
ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దు.. రాంగ్ రూట్లో వెళ్లొద్దు.. సిగ్నల్ జంప్ చేయొద్దు.. అతివేగంతో నడపొద్దు అంటూ అవగాహన కార్యక్రమాలను చేపడుతుంటే.. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు మాత్రం అటువంటి నిబంధనలు తమకు పట్టవు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి ఘటనే హైదరాబాద్లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : వాహ్ : బ్యాలెట్ బాక్సులు మోసిన లేడీ కలెక్టర్
అసలు విషయం ఏమిటంటే.. రిషికా మత అనే మహిళ రాంగ్ రూట్లో పెట్టిన ఒక ఎంపీటీసీ వెహికల్ గురించి.. ఆ ఎంపీటీసీని అలా ఎందుకు పెట్టారంటూ నిలదీసింది. అందుకు సమాధానంగా అసలు నువ్వెందుకు ఇటు వచ్చావ్..? అంటూ ఆ ప్రజాప్రతినిధి.. ఆమెను ఎదురు ప్రశ్నించారు. ఇంతలో అక్కడకు వచ్చిన ఎంపీటీసీ కూతురు (బాలిక) కారులో ఉన్న ఆమెపై వాదనకు దిగుతూ ఫోన్లో వీడియో తీసింది. ఎందుకు తీస్తున్నావ్ ఫొటోలు అని అడిగిన రిషికతో బాలిక చాలా దురుసుగా మాట్లాడింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రిషిక ట్విట్టర్లో పెట్టింది.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలా మాట్లాడడం సిగ్గుచేటు. రాబోయే తరాలను వీళ్లు ఎలా తయారు చేస్తున్నారో చూడండి అంటూ ఆమె వీడియోను ట్విట్టర్ లో పెట్టగా ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఘటనపై స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అతనిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. డేట్, టైం, ప్లేస్ చెబితే సీసీ కెమెరా చూసి మరీ చలానాలు రాస్తాం అని ప్రకటించారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.
Also Read : షెడ్యూల్ విడుదల : మే 6, 10, 14 తేదీల్లో స్థానిక ఎన్నికలు
