తెలంగాణ లాక్ డౌన్ …తెరిచి ఉండేవి ఇవే

  • Publish Date - March 23, 2020 / 10:20 AM IST

కరోనా మహమ్మారి నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యలు చేపట్టింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని  ఏయే సేవలు అందుబాటులో ఉంటాయో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రెక్కాడితేకానీ డొక్కాడని తెల్లరేషన్ కార్డు దారులకు  ప్రతి మనిషికి  12 కిలోల బియ్యం, 1500 రూపాయల నగదు అందిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.   లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండే వాటి వివరాలతో  రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవోను విడుదల చేసింది.  

తెరిచి ఉండేవి.. 
కిరణా దుకాణాలు
మెడికల్‌ షాపులు
సూపర్‌ మార్కెట్లు
కూరగాయలు, పాల దుకాణాలు
చికెన్‌, మటన్‌, చేపల మార్కెట్లు
బ్యాంకులు, పోస్టు ఆఫీసులు
పెట్రోల్‌ బంక్‌లు
గ్యాస్‌ ఏజెన్సీలు
ఫైర్‌ సర్వీస్‌

మూసి ఉండేవి..
టీ, టిఫిన్‌ సెంటర్లు
సెలూన్‌ షాపులు
బట్టల దుకాణాలు
బంగారం, ఫ్యాన్సీ, గాజులు, టైలరింగ్‌ షాపులు
ఎలక్ట్రికల్‌ వస్తువుల దుకాణాలు
టాయ్స్‌ షాపులు
విద్యా సంస్థలు