హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ కారణంగా మౌనిక అనే యువతి చనిపోయింది. అమీర్‌పేట మెట్రో స్టేషన్ పైనుంచి పెచ్చులు ఊడిపడి మౌనిక అనే వివాహిత నిండు ప్రాణాలు కోల్పోయింది. కూకట్‌పల్లికి చెందిన మౌనిక భారీ వర్షం కారణంగా అమీర్ పేట్ మెట్రో స్టేషన్ కింద బైక్ ఆపి సోదరితో కలిసి నిలబడి ఉంది.
ఇంతలో భారీ వర్షం కారణంగా మెట్రో పెచ్చులు ఊడి ఆమె తల మీద పడడంతో అక్కడికక్కడే చనిపోయింది మౌనిక. హుటాహుటీన ఆసుపత్రికి తరలించినా కూడా అప్పటికే ప్రాణం పోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.
మౌనిక స్వస్థలం మంచిర్యాల కాగా నెలన్నర క్రితమే ఆమెకు పెళ్లి అయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు దు:ఖంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఈ ఘటనపై ఎల్ అండ్ టీ అధికారులు స్పందించవలసి ఉంది. అయితే ఇటీవలే కట్టిన మెట్రో స్టేషన్ పెచ్చులు ఊడడం నాసిరకమైన పనులకు ఉదాహరణ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.