ప్రముఖ రచయిత చిన్నికృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య అనుబంధం 70ఏళ్లు బలంగా ఉందని, మేమంతా హైదరాబాద్‌లో హ్యాపీగా బతుకుతుంటే.. పవన్ కళ్యాణ్ అర్థం లేకుండా మాట్లాడుతున్నాడని అన్నారు. రాజకీయాల కోసం మా జీవితాలతో ఆడుకోవద్దు అంటూ పవన్‌కు సూచించారు.
నేను నోరు తెరిస్తే పవన్ నవరంధ్రాలు మూసుకుంటాయని, రాజకీయమంటే త్రివిక్రమ్ రాసిన డైలాగులు అనుకుంటున్నావా? అంటూ ప్రశ్నించారు. అలాగే కాపు కులస్థులకు మెగా ఫ్యామిలీ ప్రతినిధులేం కాదని, కేవలం మీ వల్లే.. ఆంధ్రప్రదేశ్‌కు వెళితే ఇబ్బందిగా ఫీలవుతున్నానని అన్నారు. భారతదేశంలో అత్యుత్తమ సీఎం.. కేసీఆర్ అని, ఆంధ్రులతో పాటు అన్నీ రాష్ర్టాల ప్రజలను కేసిఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నట్లు తెలిపారు.
రాజకీయాలు చేసి రాష్ట్రాలను విడదీయకండని అన్నారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పింది పవన్‌కు కాదని, రాజకీయాల తెలుగు రాష్ర్టాలను విడదీయవద్దు. తెలంగాణలో నివసిస్తున్న ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. పవన్ కళ్యాణ్ మోసానికి ఎవరూ గురికావద్దు. పవన్ కళ్యాణ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదు. కాపులకు చిరంజీవి కుటుంబం ప్రతినిధులు కారని, కాపులకు వంగవీటి రంగా, ముద్రగడ పద్మనాభంలు ప్రతినిధులని అన్నారు.
ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఇంద్ర వంటి సినిమా ఇస్తే.. చిరంజీవి కనీసం భోజనం కూడా పెట్టలేదని, ప్రజారాజ్యం పార్టీ పెట్టి మోసం చేశారని అన్నారు. అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రలో వైఎస్ జగన్ కచ్చితంగా సీఎం అవుతారు. వైఎస్ జగన్‌ను ఒక్కడిని చేసి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారంటూ విమర్శించారు.