డ్రోన్ కళ్లతో.. ఖైరతాబాద్ గణేశ్ కు రక్షణ

  • Publish Date - August 29, 2019 / 10:46 AM IST

వినాయక చవితి అనగానే హైదరాబాదీలకు ముందుగా గుర్తుకువచ్చేది ఎవరు? ఖచ్చితంగా ఖైరతాబాద్ వినాయకుడే. ఎందుకంటే దేశంలో అంత పెద్ద వినాయకుడి విగ్రహాన్ని ఇంకెక్కడా పెట్టరు. అందులోనూ ఖైరతాబాద్ గణేశ్ చాలా పవర్ ఫుల్. అక్కడికివెళ్లి ఏమైనా కోరుకుంటే కచ్చితంగా వారి కోరికలన్నీ నెరవేరుతాయని ప్రజల నమ్మకం. అందుకే ఖైరతాబాద్ వినాయకుడికి అంత పేరు.  

అయితే ఖైరతాబాద్ వినాయకుడిని ఒక్కో సంవత్సరం ఒక్కో రూపంలో ప్రతిష్ఠిస్తారు. ఈసారి ద్వాదశ ఆదిత్య మహా గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేశ్ దర్శనం ఇవ్వబోతున్నాడు. ద్వాదశ ఆదిత్య మహా గణపతి అంటే.. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో మొత్తం 61 అడుగుల ఎత్తులో ఈసారి గణేశ్ ను తయారు చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ లడ్డు కూడా భారీగా ఉంటుంది. ఎంత భారీ అంటే ఆ లడ్డు గురించి సంవత్సరం మొత్తం మాట్లాడుకునే అంత భారీగా ఉంటుంది. ఈ సంవత్సరం లడ్డు బరువు సుమారు 6వేల కిలోలు ఉంటుంది.  

అంతేకాదు ఈ సారి భక్తుల రక్షణ కోసం ఖైరతాబాద్ మొత్తం డ్రోన్ కెమెరాలు ఉంచబోతున్నట్లు కమిటీ నిర్ణయించింది. ఎందుకంటే ఈ సారి వినాయకుడి ఎత్తు 61 అడుగులకు చేరుకుంది. ఒక వైపు సిద్ధ కుంజికా దేవి విగ్రహం ఉంటుంది. మరోవైపు త్రిమూర్తుల స్వరూపుడైన దత్తాత్రేయుడు కొలువుదీరనున్నాడు. ఈ విగ్రహం తయారుచేయడానికి ముడు నెలల సమయం పట్టింది. ఇందుకు 250 మంది రాత్రి, పగలు కష్టపడి తయారు చేసారు. 

ఖైర్‌తాబాద్ లో 12రోజులు జరిగే వినాయక చవితి ఉత్సవాల భద్రత విషయానికి వస్తే… తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఉగ్రవాదుల నుంచి వినాయకుని నిమజ్జనం రోజున ముప్పు ఉన్న కారణంగా టెక్నాలజీ పరంగా కూడా డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.  

ఇక గత సంవత్సరం గణేశ్ విగ్రహం నిమజ్జనం కావడానికి చాలా సమయం పట్టింది. ఈ సారి ప్రత్యేకంగా మలేషియా నుంచి వచ్చిన డ్రోన్ బృందం హుస్సేన్ సాగర్ లో 61 అడుగుల విగ్రహం ఎక్కడ నిమజ్జనం చేయాలి అనేది GHMC అధికారులు, కమిటీ ప్రతినిధులు కలిసి నిర్ణయించనున్నారు.