చంద్రబాబు సీఎం కావటం ఏపీ ఖర్మ : జగన్

  • Publish Date - February 9, 2019 / 08:46 AM IST

రాజకీయ స్వార్థం కోసం టీడీపీ సర్కార్ పోలీసులను ఉపయోగించుకొంటోందని…బాబు ఆధ్వర్యంలో పోలీసు యంత్రాగం నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ఫిబ్రవరి 09వ తేదీన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను జగన్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, అవకతవకలపై ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. పోలీస్ అధికారుల నియామకాల్లోనూ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 

బాబుది దొంగ దీక్ష : – 
ఫిబ్రవరి 11వ తేదీన సీఎం బాబు చేపట్టే  దీక్ష దొంగ దీక్ష అంటూ జగన్ ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తిని తానే పొడిచేసి ఆ హత్యకు వ్యతిరేకంగా దీక్ష చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నారు. బాబు ముఖ్యమంత్రి కావడం ఖర్మ అని…అందుకే హోదా రాలేదన్నారు. గతంలో అసెంబ్లీలో హోదాపై బాబు ఏమి మాట్లాడారో అందరికీ గుర్తుందన్నారు జగన్. హోదా ఇచ్చిన రాష్ట్రాలు ఏమి బాగుపడ్డాయ్…అదేమన్నా సంజీవనా ? అని మాట్లాడలేదా గుర్తు చేశారు. 

ప్యాకేజీపై బాబు లాబీయింగ్ : – 
హోదా వద్దంటూ..ప్యాకేజీ గురించి బాబు లాబీయింగ్ చేశారని…అప్పుడు జైట్లీ..బీజేపీ పాలనను గొప్పగా పొగడలేదా అని జగన్ సూటిగా ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల తరువాత బాబు యూ టర్న్ తీసుకుని…హోదాపై దీక్షలు చేస్తుండడం హాస్యాస్పదమన్నారు. గవర్నర్‌ని జగన్ కలవడంపై తెలుగు తమ్ముళ్లు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. 

Read Also: ఎలక్షన్ మనీ : ప్రచారానికి వస్తే టీవీలు, బైక్స్, బంగారం