యాదాద్రి శిలలపై ఆ పేర్లు తొలగింపు

  • Publish Date - September 7, 2019 / 10:08 AM IST

యాదాద్రి శిల్పాలపై  రాజకీయ బొమ్మలు చెక్కడం పట్ల తీవ్ర విమర్శలు తలెత్తటంతో వైటీడీఏ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆలయ స్తంభాలపై ఉన్న కేసీఆర్ కిట్, హరితహారం అనే పదాలను తొలగించారు. మిగిలిన అన్ని ప్రభుత్వ పధకాల చిత్రాలు అలానే ఉంచారు.

యాదాద్రిలో ఆలయం బయట ఏర్పాటు చేసిన స్తంభాల్లో ఉన్నకేసీఆర్ చిత్రం, కారు, మహాత్మాగాంధీ, జవహార్ లాల్ నెహ్రూ,  ఇందిరాగాంధీ,  కమలం, సైకిల్, ఎడ్లబండి, వంటి చిత్రాలను అలాగే ఉంచారు. యాదాద్రి శిలలపై సుమారు 5వేల చిత్రాలు గీస్తే వాటిలో రాజకీయ చిత్రాలు ఉండటం వివాదాలకు దారి తీసింది.

యాదాద్రి శిలలపై వివాదం రాజుకోవటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండపైన నిర్మాణాలు జరుగుతున్న వైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు.