అలర్ట్! జనవరి 15నుంచి ఇలా చేయకపోతే ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ కాల్స్ కుదరవు

అలర్ట్! జనవరి 15నుంచి ఇలా చేయకపోతే ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ కాల్స్ కుదరవు

Updated On : January 15, 2021 / 10:16 AM IST

Mobile Phone Calls: టెలికాం ఆపరేరటర్లు తమ సబ్‌స్క్రైబర్స్‌కు కీలకమైన సమాచారం ఇచ్చింది. జనవరి 15నుంచి ల్యాండ్ లైన్ టూ మొబైల్ ఫోన్స్ కు కాల్ చేయాల్సి వస్తే ముందుగా సున్నా యాడ్ చేయాల్సి ఉంది. ఒకవేళ అలా చేయకపోతే కాల్స్ చేయడం కుదరదు. ‘డైరక్టరీ ఆఫ్ టెలికాం ఈ రూల్స్ 2021 జనవరి 15నుంచి అమల్లోకి వస్తుందని చెప్పింది. ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ ముందు సున్నా యాడ్ చేస్తే సరిపోతుందని చెప్పింది’ ఎయిర్‌టెల్.

రిలయన్స్ జియో సైతం తమ యూజర్లకు సున్నా యాడ్ చేసుకోమని మెసేజ్ లు పంపుతూ వస్తుంది. ఏ మొబైల్ నెంబర్ కు కాల్ చేసినా తప్పనిసరి అని స్పష్టం చేసింది. డీఓటీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జనవరి 15నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం నవంబరులోనే ఈ విషయాన్ని ప్రకటించింది.

టెలికాం మంత్రిత్వ శాఖ.. భవిష్యత్ అవసరాల కోసం నెంబరింగ్ రిసోర్సులు పెంచాలని ప్లాన్ చేస్తుంది. 2వేల 539మిలియన్ నెంబరింగ్ సిరీస్ లు జనరేట్ అవ్వొచ్చనే అంచనాకు వస్తున్నారు. మిగతావి అంతా సేమ్ టూ సేమ్.. ఫిక్స్‌డ్-టూ-ఫిక్స్‌డ్, మొబైల్-టూ-ఫిక్స్‌డ్ , ఫిక్స్‌డ్-టూ-మొబైల్, మొబైల్-టూ-మొబైల్ కు కాల్ చేయడానికి నెంబర్ మార్చాల్సిన పనిలేదు. కేవలం సున్నా మాత్రమే యాడ్ చేయాల్సి ఉంటుంది.

బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ పీకే పుర్వార్.. మాట్లాడుతూ యూజర్లకు అవగాహన కోసం తప్పనిసరి కమ్యూనికేషన్ ఏర్పాటుచేశారు.