ఆర్మీ కెప్టెన్ రూ.20లక్షల కోసమే ఎన్‌కౌంటర్ చేశారా..

Army Officer: గతేడాది జులై 18న జమ్మూ అండ్ కశ్మీర్‌లోని షోపియన్ లో ముగ్గురు యువకులను ఓ ఆర్మీ కెప్టెన్ ఎన్‌కౌంటర్ చేశారు. కేస్ ఛార్జ్ షీట్ ప్రకారం.. రూ.20లక్షల రివార్డు మనీ కోసమే ఇది జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
‘ఆ ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావిస్తూ.. కెప్టెన్ భూపేంద్ర సింగ్ (62RR) మరో ఇద్దరు కలిసి ఉద్దేశ్యపూర్వకంగానే అక్కడి సాక్ష్యాలు తారుమారుచేశారు. కావాలనే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రైజ్ మనీ రూ.20లక్షలు దక్కించుకోవాలని ప్లాన్ చేశారు’ అని పోలీస్ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. రాజౌరీకి చెందిన యువకులు ఇంతియాజ్ అహ్మద్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ ఇబ్రార్ లను షోపియన్ జిల్లాలోని అంశీపురాలో టెర్రరిస్టులంటూ ముద్రవేసి ఎన్ కౌంటర్ చేశారని తేలింది.
షోపియన్ ఎస్పీ అమృత్‌పాల్ సింగ్ మాట్లాడుతూ.. ఛార్జి షీట్ అనేది ప్రస్తుతం కోర్ట్ ప్రాపర్టీ.. వారికి కావాలంటే బయటపెడతారు లేదంటే లేదు అని చెప్పారు. కెప్టెన్ భూపేంద్ర సింగ్, తబీష్ నజీర్, బిలాల్ అహ్మద్ లోనె పేర్లను 14వందల పేజీల ఛార్జి షీట్ లో ఫైల్ చేసి చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ఉంచారు.
న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. సుబేదార్ గారు రామ్, లాన్స్ నాయక్ రవి కుమార్, సిపాయీస్ అశ్వినీ కుమార్, యోగేశ్ లు అంతా కెప్టెన్ సింగ్ టీంకు చెందిన వారే. ఆ ఘటన జరిగిన తర్వాతనే ఆ ప్రదేశానికి పలు డైరక్షన్లలో చేరుకున్నారు. ఆ తర్వాత ఏదో శబ్దం వచ్చిందని అప్పుడే ఘటనాస్థలికి చేరుకున్నామని చెబుతున్నారు. నిజానికి ముందుగా అంతా కలిసే ఎన్‌కౌంటర్ చేశామని చెప్పినా.. తర్వాత ఏఎఫ్ఎస్‌పీఏ 1990 (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ను అతిక్రమించి ప్రవర్తించారని అధికారులు అంటున్నారు.