×
Ad

Womens : ఆర్మీలో చేరే మహిళలకు కేంద్రం శుభవార్త

భారతీయ సైన్యంలో చేరే మహిళలకు కేంద్ర రక్షణ శాఖ శుభవార్త వెల్లడించింది. భారత సైన్యంలో మహిళల సంఖ్యను పెంచే యోచనలో కేంద్ర రక్షణ శాఖ ఉందని ఆ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో వెల్లడించారు.....

  • Published On : August 1, 2023 / 05:16 AM IST

Women In Army

Womens : భారతీయ సైన్యంలో చేరే మహిళలకు కేంద్ర రక్షణ శాఖ శుభవార్త వెల్లడించింది. భారత సైన్యంలో మహిళల సంఖ్యను పెంచే యోచనలో కేంద్ర రక్షణ శాఖ ఉందని ఆ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో వెల్లడించారు. పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జులై 2022వ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చేలా సంవత్సరానికి మహిళా ఆర్మీ క్యాడెట్‌ల కోసం 20 ఖాళీలు కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. (Centre Plans To Increase Vacancies)

Janasena : వాలంటీర్ చేసిన హత్యకు బాధ్యత ఎవరు తీసుకుంటారు జగన్? ముఖ్యమంత్రిని నిలదీసిన పవన్ కల్యాణ్

షార్ట్ సర్వీస్ కమిషన్‌లో మహిళల కోసం 90 ఖాళీలు ఉన్నాయని, ఇందులో 10 అదనపు ఖాళీలు 2023 జూన్ నుంచి అమల్లోకి వచ్చాయని ఆయన చెప్పారు. (Women In Army) ఆర్టిలరీ యూనిట్లతో పాటు రీమౌంట్ , వెటర్నరీ కార్ప్స్‌లోకి మహిళా అధికారులను చేర్చుకోవడానికి 2023 మార్చి నుంచి ఆమోదం లభించిందని మంత్రి భట్ చెప్పారు. ఆర్మీ ఏవియేషన్‌లో పైలట్‌లుగా మహిళా అధికారుల ప్రవేశం ప్రారంభమైందని ఆయన తెలిపారు.

Manchu Manoj : చంద్రబాబుతో మంచు మనోజ్‌ ఫ్యామిలీ..

ఇండియన్ ఆర్మీలో కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్‌లో ఇతర ర్యాంక్‌లలో మహిళలను చేర్చుకుంటున్నామని మంత్రి వివరించారు. ఈ ఏడాది జులై నాటికి ఇండియన్ ఆర్మీ మెడికల్ క్యాడర్‌లోని మొత్తం మహిళల సంఖ్య ఆర్మీ మెడికల్ కార్ప్స్ లో 1,212 మంది, ఆర్మీ డెంటల్ కార్ప్స్ లో 168, మిలిటరీ నర్సింగ్ సర్వీస్ లో 3,841 మంది మహిళలను చేర్చుకున్నామన్నారు. భారత సైన్యంలో మహిళల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని కేంద్ర మంత్రి చెప్పారు.