Kaziranga night jeep safari
Kaziranga night jeep safari: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, సద్గురు జగ్గీ వాసుదేవ్ చిక్కుల్లో పడ్డారు. అసోంలోని కాజీరంగ జాతీయ పార్కులో సూర్యాస్తమయం తర్వాత వారిద్దరు జీపులో సఫారీ యాత్రకు వెళ్లారు. దీనిపై సమీప గ్రామస్థులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వన్యప్రాణుల పరిరక్షణ చట్టం నిబంధనలకు విరుద్ధమని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అయితే, ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమంలో భాగంగానే ఆ యాత్రకు వెళ్లారని అధికారులు అంటున్నారు.
నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని చెప్పారు. కాజీరంగ జాతీయ పార్కులో నిబంధనలకు విరుద్ధంగా బిశ్వశర్మ, జగ్గీ వాసుదేవ్ పర్యటించిన అంశం చర్చనీయాంశంగా మారింది. దీంతో దీనిపై హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ… సూర్యాస్తమయం అనంతరం ఆ పార్కులోకి వెళ్లవద్దన్న నిబంధన ఏమీ లేదని అన్నారు. తాను సఫారీ యాత్ర చేసేముందు అధికారుల అనుమతి తీసుకున్నానని చెప్పారు.
అనుమతి తీసుకుని అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు కూడా పార్కులోకి వెళ్లవచ్చని అన్నారు. తమపై కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, శనివారం పార్కులో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం బిశ్వశర్మ, సద్గురు జగ్గీ వాసుదేవ్ పార్కులో సఫారీ యాత్ర చేశారు. ఈ వివాదంపై సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందించలేదు.
Hyderabad T20 Match: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ.. జట్టు వివరాలు..