Bengaluru : బెంగళూరులో వరుస పేలుళ్లకు పథకం.. ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉగ్రవాదులు పేలుళ్లకు పన్నిన వ్యూహాన్ని బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను బెంగళూరు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు....

Bengaluru police

Bengaluru Central Crime Branch : కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పన్నిన వ్యూహాన్ని బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను బెంగళూరు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. (Five suspected terrorists arrested) అరెస్టయిన వారిని జునైద్, సోహైల్, ఉమర్, ముదాసిర్, జాహిద్‌లుగా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్‌లతో పాటు పలు పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Yamuna again Danger Mark : మళ్లీ పెరిగిన యమునా నదీ నీటిమట్టం

బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసిన వారిలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. (planning explosions in Bengaluru) అరెస్టయిన ఐదుగురు నిందితులు 2017వ సంవత్సరంలో జరిగిన హత్యకేసులో ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. నిందితులు గతంలో బెంగుళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు.

Jammu and Kashmir : అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పులు..ఇద్దరికి గాయాలు

జైలులో వారికి కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని, వారు పేలుడు పదార్థాలను తయారు చేయడంలో శిక్షణ పొందారు. బెంగళూరు నగరంలో పేలుళ్లకు సంబంధించిన ప్లాన్‌పై సీసీబీకి సమాచారం అందడంతో నిందితులను అరెస్ట్ చేశారు.

పరారీలో మరొక నిందితుడు..
నగరంలో విధ్వంసానికి పాల్పడేందుకు ప్లాన్ చేసిన ఐదుగురు వ్యక్తులను పట్టుకోవడంలో సీసీబీ విజయం సాధించిందని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద తెలిపారు. నిందితుల నుంచి ఏడు పిస్టల్స్, పలు
లైవ్ బుల్లెట్లు, వాకీటాకీ, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. పరారీలో మరొక నిందితుడు.. విధ్వంసకర కార్యకలాపాల కోసం ఈ ఐదుగురు నిందితులకు పేలుడు పదార్థాలు, ఆయుధాలు
అందించాడని చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేసినట్టు తెలిపారు. కాగా, ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించాలని కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత
బసవరాజ్ బొమ్మై డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు