Police seize banned medicines: 85,000 నిషేధిత ఔషధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

హరియాణా పోలీసులు 85,000కు పైగా నిషేధిత ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 10,000 క్యాప్సూల్స్, 75,000 ట్యాబ్లెట్లు, 300 బాటిళ్ల సిరప్ లు, 100 ఇంజక్షన్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. యమునానగర్ జిల్లాలో ఓ కారులో వాటిని తరలిస్తుండగా పట్టుకున్నామని వివరించారు. ఒకరిని అరెస్టు చేశామని చెప్పారు.

Police seize banned medicines: హరియాణా పోలీసులు 85,000కు పైగా నిషేధిత ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 10,000 క్యాప్సూల్స్, 75,000 ట్యాబ్లెట్లు, 300 బాటిళ్ల సిరప్ లు, 100 ఇంజక్షన్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. యమునానగర్ జిల్లాలో ఓ కారులో వాటిని తరలిస్తుండగా పట్టుకున్నామని వివరించారు. ఒకరిని అరెస్టు చేశామని చెప్పారు.

ఆ నిషేధిత ఔషధాలను ఉత్తరప్రదేశ్ నుంచి హరియాణాలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. కారులో పెద్ద మొత్తంలో ఓ వ్యక్తి ఔషధాలు తరలిస్తున్నాడంటూ తమకు వచ్చిన రహస్య సమాచారం మేరకు కలనౌర్ సరిహద్దు వద్ద తనిఖీలు చేశామని, దీంతో అతడు దొరికాడని పోలీసులు చెప్పారు.

20 బాక్సుల్లో స్పాస్మో ప్రాక్సివాన్ క్యాప్సూల్స్, 10 బాక్సుల్లో లోమోటిల్ ట్యాబ్లెట్లు, 25 బాక్సుల్లో ప్యీవొన్ స్పాస్ ప్లస్ క్యాప్సూల్స్, 25 బాక్సుల్లో అల్ప్రాజొలాం ట్యాబ్లెట్లు, 2 బాక్సుల్లో క్లోర్ఫెనిరమైన్ సిరప్, 5 బాక్సుల్లో హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్, 2 బాక్సుల్లో ట్రమాడొల్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

నిందితుడి పేరు అమిత్ కుమార్ అని చెప్పారు. అతడు అంబాలా జిల్లాలోని బరారాకు చెందిన వ్యక్తి అని చెప్పారు. అంత పెద్ద ఎత్తున నిషేధిత ఔషధాలను అతడు ఎక్కడకు తీసుకెళ్తున్నాడు? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అన్న విషయాలపై తదుపరి విచారణ జరుపుతున్నామని తెలిపారు.

Wrestlers Protest: తాత్కాలికంగా ఆందోళన విరమించిన రెజ్లర్లు.. కేంద్ర క్రీడా మంత్రితో చర్చలు అనంతరం నిర్ణయం ..

ట్రెండింగ్ వార్తలు