Wrestlers Protest: తాత్కాలికంగా నిరసన విరమించిన రెజ్లర్లు.. కేంద్ర క్రీడా మంత్రితో చర్చలు అనంతరం నిర్ణయం ..

శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఢిల్లీలోని తన నివాసంలో రెజ్లర్లతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెండోదఫా చర్చలు జరిపారు. సుమారు 7గంటల పాటు ఈ చర్చలు కొనసాగాయి. చర్చలు సఫలం కావడంతో విచారణ పూర్తయ్యే వరకు రెజ్లర్లు తమ నిరసనకు తాత్కాలిక విరామం ప్రకటించారు.

Wrestlers Protest: తాత్కాలికంగా నిరసన విరమించిన రెజ్లర్లు.. కేంద్ర క్రీడా మంత్రితో చర్చలు అనంతరం నిర్ణయం ..

Wrestlers Protest

Wrestlers Protest: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విధితమే. బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, ప్రతిభ కలిగిన రెజ్లర్లకు అన్యాయం జరుగుతుందని వెంటనే అతన్ని డబ్ల్యూఎఫ్ఐ నుంచి తొలగించాలని రెజ్లర్లు జంతర్ మంతర్ వద్దధర్నాను కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలో భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా 30 మంది ఉన్నారు. గత రెండు రోజులుగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి, ఇతర అధికారులు వీరితో చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు.

Wrestler protest: రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న బ్రిజ్ భూషణ్.. IOAని ఆశ్రయించిన రెజ్లర్లు

శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఢిల్లీలోని ఆయన నివాసంలో రెజ్లర్లతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెండోదఫా చర్చలు జరిపారు. సుమారు 7గంటల పాటు ఈ చర్చలు కొనసాగాయి. చర్చల అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మానిటరింగ్ కమిటీ వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించామని తెలిపారు. ఇందులో పాల్గోనున్న  వ్యక్తుల పేర్లను ఆదివారం ప్రకటిస్తామని అన్నారు. ఈ కమిటీ తన విచారణను నాలుగు వారాల్లో పూర్తిచేస్తుందని, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌పై వచ్చిన అన్ని ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపారు.

Wrestlers Protest: ‘ముందు స్టేజీ దిగండి’.. రెజ్లర్ల నిరసనలో బృందా కారత్ సహా లెఫ్ట్ నేతలకు చేదు అనుభవం

సుమారు ఏడుగంటల పాటు రెజ్లర్లతో చర్చలు జరిగాయని కేంద్ర మంత్రి చెప్పారు. రెజ్లింగ్ అసోసియేషన్ పై వచ్చిన ఆరోపణల గురించి రెజ్లర్లందరూ చెప్పారు. వారి డిమాండ్లన్నింటిని విన్నాం. రెజ్లర్ల ఆరోపణల తర్వాత డబ్ల్యూఎఫ్ఐ‌కి మేము నోటీసులు‌సైతం పంపించామని, 72 గంటల్లో సమాధానం కోరామని గుర్తు చేశారు. ఈ చర్చల్లో భాగంగా విచారణ పూర్తయ్యే వరకు రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సంఘం రోజువారీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని, విచారణకు సహకరిస్తారని కేంద్ర మంత్రి రెజ్లర్లకు హామీ ఇచ్చారు. నాలుగు వారాల్లో కమిటీ విచారణ నివేదిక రానుందని, నివేదిక ఆధారంగా సమస్యపై ముందుకెళ్తామని కేంద్ర మంత్రి తెలిపారు.

Wrestler protest: కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళన.. మద్దతు తెలిపిన బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ ..

అనంతరం ఏస్ ఇండియా రెజ్లర్ బజరంగ్ పునియా మాట్లాడుతూ.. కేంద్ర క్రీడా మంత్రి తమ డిమాండ్లను విన్నారని, సరియైన విచారణ జరుగుతుందని మాకు హామీ ఇచ్చారని తెలిపారు. తమ సమస్యలను విన్నందుకు, వాటి పరిష్కారంకు హామీ ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. న్యాయమైన విచారణ జరుగుతుందని మేము ఆశిస్తున్నామని, అందుకే విచారణ పూర్తయ్యే వరకు తమ నిరసనను విరమిస్తున్నామని తెలిపారు.