Wrestler protest: కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళన.. మద్దతు తెలిపిన బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ ..

జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్న రెజ్లర్లకు ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారుడు, కాంగ్రెస్ నేత విజేందర్ సింగ్ మద్దతు ప్రకటించారు. వారితో కొద్దిసేపు నిరసనలో పాల్గొన్నారు. అనంతరం విజేందర్ సింగ్ మాట్లాడుతూ.. రెజ్లర్లను కలిసివారికి మద్దతు తెలిపేందుకు నేను ఇక్కడికి వచ్చినట్లు చెప్పాడు.

Wrestler protest: కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళన.. మద్దతు తెలిపిన బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ ..

Boxer Vijender Singh

Wrestler protest: వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా దాదాపు 30 మంది రెజ్లర్లు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. బ్రిజ్ భూషణ్ ను పదవి నుంచి తొలగించాల్సిందేనని, ఆయన్ను జైలుకు పంపే వరకు ఆందోళన విరమించబోమని రెజర్లు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనగా దిగారు. శుక్రవారం వరుసగా మూడో రోజు తమ నిరసనను కొనసాగించారు. పలువురు వీరి ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటిస్తున్నారు.

Wrestlers Protest: ‘ముందు స్టేజీ దిగండి’.. రెజ్లర్ల నిరసనలో బృందా కారత్ సహా లెఫ్ట్ నేతలకు చేదు అనుభవం

శుక్రవారం జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్న రెజ్లర్లకు ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారుడు, కాంగ్రెస్ నేత విజేందర్ సింగ్ మద్దతు ప్రకటించారు. వారితో కొద్దిసేపు నిరసనలో పాల్గొన్నారు. అనంతరం విజేందర్ సింగ్ మాట్లాడుతూ.. రెజ్లర్లను కలిసివారికి మద్దతు తెలిపేందుకు నేను ఇక్కడికి వచ్చినట్లు చెప్పాడు. విజేందర్ సింగ్ తొలుత నిరసన కారులతో వేదికపై కూర్చున్నాడు. అయితే రెజ్లర్లు మాత్రం తమ ఆందోళనకు ఎలాంటి రాజకీయ రంగు పులుముకోవటం తమకు ఇష్టం లేదని, వేదికపై నుంచి దిగిపోవాలని విజేందర్ సింగ్ కు సూచించినట్లు తెలిసింది. ఇదిలాఉంటే గురువారం‌సైతం సీపీఐ నాయకురాలు బృందా కారత్‌ను‌సైతం వేదికపై నుంచి దిగాలని రెజ్లర్లు కోరారు.

 

ఇదిలాఉంటే, లైంగిక వేధింపులకు సంబంధించి తమవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని రెజ్లర్లు వెల్లడించారు. రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. 72 గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్ఐను హెచ్చరించింది. రెజ్లర్ల ఆరోపణలపై ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య బ్రిజ్ భూషణ్ ఈ రోజు మీడియా ముందుకు రానున్నారు. తొలుత మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆయన మీడియా సమావేశం ఉంటుందని ప్రకటన వచ్చింది. ఆ తరువాత సాయంత్రం 4గంటలకు మీడియా సమావేశం ఉంటుందని మరో ప్రకటన వెలువడింది.

 

మరోవైపు కేంద్ర తరపున రాయబారిగా స్టార్ రెజ్లర్, బీజేపీ నాయకురాలు బజితా ఫొగాట్ గురువారం రెజ్లర్లతో చర్చలు జరిపారు. ప్రభుత్వం రెజ్లర్లకు అండగా ఉంటుందని చెప్పారు. క్రీడా శాఖ అధికారులుకూడా రెజ్లర్లతో చర్చలు జరిపారు. హామీలతో కాదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి రెజ్లర్లతో సమావేశం కానున్నారు.