Balasore: బాలాసోర్‌లో రైల్వేట్రాక్ పునరుద్ధరణ…వందేభారత్‌తోపాటు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు షురూ

Balasore Railway track resume : ఘోర రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ లో రైల్వేట్రాక్‌ల పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు.దీంతో సోమవారం ఉదయం బాలాసోర్ నుంచి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుతోపాటు పలు ప్యాసింజరు రైళ్లు రాకపోకలు సాగించాయి. రైలు ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పూర్తి చేయించారు. ముందుగా గూడ్స్ రైలు నడిపిన అధికారులు సోమవారం ఉదయం ప్యాసింజర్ రైళ్లను నడిపారు.

Odisha Train Accident : ఒడిషా రైలు ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత రైల్వే ట్రాక్ పునరుద్ధరణ..ట్రాక్‌పై వెళ్లిన మొదటి రైలు

మరమ్మతులు చేసిన రైల్వేట్రాక్ పై వందేభారత్ రైలును వేగం తగ్గించి నడిపించారు. సిగ్నిలింగ్ ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టంను మార్చామని మంత్రి చెప్పారు. మరమ్మతులు చేసిన రైలు మార్గంలో బహానగర్ బజార్ రైల్వేస్టేషను వద్ద ముందుగా బొగ్గుతో విశాఖపట్టణం నుంచి రూర్కెలా వెళుతున్న గూడ్స్ రైలును నడిపారు. పూరి-హౌరా మధ్య స్పెషల్ రైళ్లను నడిపారు. భద్రక్-ఖరగ్ పూర్ మధ్య కొన్ని రైళ్లను నడిపారు.

ట్రెండింగ్ వార్తలు