Odisha Train Accident : ఒడిషా రైలు ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత రైల్వే ట్రాక్ పునరుద్ధరణ..ట్రాక్‌పై వెళ్లిన మొదటి రైలు

Odisha Train Accident : ఒడిషా రైలు ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత రైల్వే ట్రాక్ పునరుద్ధరణ..ట్రాక్‌పై వెళ్లిన మొదటి రైలు

First train movement

Odisha Train Accident: బాలాసోర్ రైల్వేస్టేషను వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను రైల్వే అధికారులు ఆదివారం రాత్రి పునరుద్ధరించారు. ఒడిషా ఘోర రైలు ప్రమాదం జరిగిన 51 గంటల తర్వాత బాలాసోర్(Balasore) ట్రాక్ మీదుగా మొట్టమొదటి గూడ్స్ రైలు వెళ్లింది.(First train movement) బాలాసోర్ స్టేషను వద్ద మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో 275 మంది మరణించారు.(Odisha tragedy)

బాలాసోర్ ప్రమాద స్థలంలో అప్ అండ్ డౌన్ రైల్వే ట్రాక్‌లను మరమ్మతులు చేశామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnaw) చెప్పిన కొన్ని గంటల తర్వాత, ఆదివారం రాత్రి ఈ సెక్షన్‌లో మొదటి రైలు కదలిక నమోదైంది.పునరుద్ధరించిన పట్టాల గుండా రైలు వెళుతుండగా రైల్వే మంత్రి సంఘటనా స్థలంలో ఉన్నారు.

‘‘డౌన్‌లైన్ పునరుద్ధరణ పూర్తయింది. సెక్షన్‌లో మొదటి రైలు కదలింది’’ అని రైల్వేశాఖ మంత్రి ట్వీట్ చేశారు.సోమవారం తెల్లవారుజామున అప్-లైన్‌ను అనుసంధానించే ట్రాక్ పునరుద్ధరణ, ఓవర్‌హెడ్ విద్యుద్దీకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయని వైష్ణవ్ ట్వీట్ చేశారు.